Loan: చౌక వడ్డీకి రూ.10 లక్షలు రుణం.. మోదీ సర్కార్ సదవకాశం.. వినియోగించుకోండి - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Loan: చౌక వడ్డీకి రూ.10 లక్షలు రుణం.. మోదీ సర్కార్ సదవకాశం.. వినియోగించుకోండి

11/06/2023

 Loan: చౌక వడ్డీకి రూ.10 లక్షలు రుణం.. మోదీ సర్కార్ సదవకాశం.. వినియోగించుకోండి

Mudra Loans: దేశంలో ప్రస్తుతం అనేక మంది తన కలలను కేవలం ఉద్యోగాలతో తీర్చుకోలేమని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది తమలోని వ్యాపార నైపుణ్యాలపై దృష్టి సారిస్తూ సొంత వ్యాపారాలను నెలకొల్పాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే పండుగ సీజన్ లో సొంత వ్యాపారాలను షురూ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీ కలలను నిజం చేసుకునేందుకు డబ్బు కొరత ఉన్నట్లయితే.. ఈ వార్త మీకోసమే. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఇలాంటి అవసరాలు ఉండే వ్యక్తుల కోసం ప్రధాన మంత్రి ముద్రా యోజనను తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే వ్యక్తులు కనీస పత్రాలను సమర్పించటం ద్వారా సరసమైన వడ్డీకే రుణాన్ని పొందవచ్చు.

 

ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. నేటి తరం యువతలో వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం శిశు కేటగిరీలో రుణాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే కిషోర్, తరుణ్ పేరుతో ఇతర కేటగిరీల కింద రుణాలను అందిస్తోంది. అయితే రుణాన్ని అందించే బ్యాంకులు వడ్డీ రేటును నిర్ణయిస్తాయి. ఈ పథకం కింద ముద్ర కార్డు కూడా అందుబాటులో ఉంది. ఇది డెబిట్ కార్డ్ లాంటిది. పథకం కింద దరఖాస్తు చేయడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఐడీ, అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను అందించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.mudra.org.in/offeringsని సందర్శించి అక్కడ దరఖాస్తును పూర్తి చేయవచ్చు.

ముద్ర యోజన కింద బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, మైక్రో ఫైనాన్స్ సంస్థల నుంచి సులభంగా రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు. ఇందులో శిశు కేటగిరీ కింద రూ.50,000 వరకు రుణం అందిచంబడుతుంది. ఆ తర్వాత కిషోర్ కేటగిరీ కింద రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు, చివరగా తరుణ్ కేటగిరీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాన్ని మీరు వ్యాపారం కోసం పొందవచ్చు.


close