Maida: మైదా పిండిని తెల్లటి విషం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Maida: మైదా పిండిని తెల్లటి విషం అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

11/04/2023

 Maida: మైదా పిండిని తెల్లటి విషం అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

Maida Side Effects:గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, రాగుల నుండి రాగిపిండి వస్తుంది. కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది…? మైదా పిండి ఎలా వస్తుంది…?
అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది…? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా…ఒక్కసారి దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది.

మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ బెంజాయిల్ పెరాక్సైడ్ (Benzoyl peroxide) అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా, ఐరోపా దేశాల్లో నిషేధించబడినది. మైదా లో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది.

అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు.
మైదాపిండితో రవ్వ దోసె వంటి అట్లు…. పరోటా, రుమాలీ రోటీ లాంటివి…. కేక్స్, కాజాలు, హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు మరియు బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.

మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.


close