Mobile Charger: ఇలాంటి గుర్తులు కనుక కనిపించకపోతే.. పొరపాటున కూడా ఆ ఛార్జర్‌ను కొనకండి.. లేకుంటే పేలిపోవడం ఖాయం..! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Mobile Charger: ఇలాంటి గుర్తులు కనుక కనిపించకపోతే.. పొరపాటున కూడా ఆ ఛార్జర్‌ను కొనకండి.. లేకుంటే పేలిపోవడం ఖాయం..!

11/06/2023

 Mobile Charger: ఇలాంటి గుర్తులు కనుక కనిపించకపోతే.. పొరపాటున కూడా ఆ ఛార్జర్‌ను కొనకండి.. లేకుంటే పేలిపోవడం ఖాయం..!

ఫోన్ (Mobile Phones) కొనేటపుడు గతంలో ఛార్జర్‌లు (Mobile Charger) కూడా ఉచితంగా ఇచ్చేవారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే కారణంతో ఇటీవల కొన్ని కంపెనీలు మొబైల్‌తో పాటు ఛార్జర్లను ఇవ్వడం లేదు.
దీంతో చాలా మంది మళ్లీ ప్రత్యేకంగా ఛార్జర్లను కొంటున్నారు. కంపెనీ ఛార్జర్లు కొంటే ఫర్వాలేదు కానీ, థర్డ్ పార్టీ ఛార్జర్లు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాల బారిన పడాల్సి ఉంటుంది. ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా మొబైల్ పేలిపోయిందని, రాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టి వదిలేసినపుడు మొబైల్ పేలిపోయిందని వచ్చే వార్తలను మీరు చూసే ఉంటారు (Tips before buying the Mobile charger).

ఇలా మొబైల్స్ పేలిపోవడానికి నాణ్యత లేని ఛార్జర్లే (Fake Chargers) కారణమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముఖేష్ కుమార్ అనే వ్యక్తి మొబైల్ ఛార్జర్ నాణ్యతను గుర్తించేందుకు అసరమయ్యే చిట్కాలను సూచించారు. ఇటీవల ఓ బాలుడు మొబైల్ ఫోన్‌ ఛార్జర్‌కి కనెక్ట్ చేసి ఉన్నప్పుడు మాట్లాడుతుండగా, అది పేలిపోయి అతడి చేయి కాలిపోయిందని చెప్పారు. దీనికి మొబైల్ ఛార్జరే కారణమని ఆయన తెలిపారు. కాబట్టి వాటిని కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యతను పరిశీలించడం చాలా ముఖ్యమని తెలిపారు (Important Tips).
చార్జర్‌ను ప్లగ్‌కు కనెక్ట్ చేసే దగ్గర ఉన్న మూడు గుర్తులను (Marks on Charger) జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. రెండు చతురస్రాల ఆకారం, 8 నంబర్‌తో కూడిన గుర్తు, ఇంటి ఆకృతి ఉన్న ఛార్జర్‌ను మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. ఆ గుర్తులు ఉన్న ఛార్జర్‌లు మాత్రమే నాణ్యత కలిగినవని ఆయన తెలిపారు. అలాగే BIS కేర్ వెబ్‌సైట్‌కి వెళ్లి, ఛార్జర్‌పై వ్రాసిన కోడ్‌ను ఎంటర్ చేస్తే ఛార్జర్ వివరాలు వస్తాయని, అలా కూడా దాని నాణ్యతను టెస్ట్ చేయవచ్చని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 16 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.


close