ఉల్లి రసం ఇలా వాడితే మీకు బట్టతల రమ్మన్నా రాదు..!!
ఉల్లిపాయ తినడానికి మాత్రమే కాదు, దానిని ఔషధంగా ఉపయోగించడం ద్వారా మీరు మీ జుట్టును కాపాడుకోవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో ఉల్లిపాయ రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
ఉల్లిపాయ రసంలో విటమిన్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.
ఉల్లి రసంతో తల మసాజ్ చేస్తే లాభాలు ఇవే:
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్న ఉల్లిపాయ రసాన్ని మీ తలకు రాసుకుంటే అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గిస్తాయి. ఉల్లిపాయ రసంతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే సల్ఫర్ జుట్టు పల్చబడటం, రాలడాన్ని నివారించడంలో చాలా సహాయపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను పునరుద్ధరించడంలో కూడా సహాయపడుతుంది.
ఉల్లిపాయ రసాన్ని కాటన్ బాల్‌కు అప్లై చేసి జుట్టుకు పట్టించాలి. దీని తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి. 15 నిమిషాలు అలాగే ఉంచిన తర్వాత, షాంపూతో జుట్టును కడగాలి. ఉల్లిపాయ రసాన్ని వారానికి మూడు సార్లు రాయండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు విరగడం, రాలడం ఆగిపోతుంది.
ఉల్లిపాయ రసంతో ఇలా చేయండి:
ఉల్లిపాయ రసం చాలా సులభంగా తీయవచ్చు. ఒక ఉల్లిపాయను తీసుకుని, పై తొక్కను శుభ్రం చేసి, ఉల్లిపాయను బ్లెండర్లో మెత్తగా పేస్ట్ చేయండి. తర్వాత శుభ్రమైన గుడ్డలో పేస్ట్ వేసి బాగా పిండాలి. ఇది కాకుండా, మీకు కావాలంటే, ఉల్లిపాయ రసాన్ని తురుముకుని సైతం రసాన్ని తీయవచ్చు.
ఉల్లిపాయ రసం , కొబ్బరి నూనె:
కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇది చుండ్రు, ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో, 4-5 చుక్కల టీ ట్రీ ఆయిల్‌తో పాటు 2 టీస్పూన్ల ఉల్లిపాయ రస , 2 టీస్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టు తలకు బాగా పట్టించాలి. సుమారు అరగంట తర్వాత తల స్నానం చేయాలి.