Ponnaganti Kura For Eyes : ఈ ఆకుకూర ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Ponnaganti Kura For Eyes : ఈ ఆకుకూర ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?

11/08/2023

 Ponnaganti Kura For Eyes : ఈ ఆకుకూర ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?

Ponnaganti Kura For Eyes : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. పొన్నగంటి కూర మనందరికి తెలిసిందే. దాదాపు ఇది మనకు సంవత్సరం పొడవునా లభిస్తుంది.
పొటాలా గట్ల వెంబడి ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పొన్నగంటి కూరలో ఉండే పోషకాల గురించి అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పొన్నగంటికూరలో బీటా కెరోటీన్, ఐరన్, ఫైబర్, క్యాల్షియం, విటమిస్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తలనొప్పితో బాధపడే వారు పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వాతావరణ మార్పుల కారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి.

Ponnaganti Kura For Eyes

అలాగే ఈ ఆకుకూర రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. పొన్నగంటి ఆకుకూరను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే ఈ ఆకుకూరను ఉపయోగించడం వల్ల మనం చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఈ ఆకు నుండి రసాన్ని తీసి ముఖానికి రాసుకోవడం వల్ల నల్ల మచ్చలు,మొటిముల తగ్గుతాయి. ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

.


close