✍️నేను ఆర్డరిస్తే అంతర్జాతీయ కోర్టులోనూ స్టే దొరకదు
♦️విద్యాశాఖాధికారులపై ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహం
*🌻లింగసముద్రం, న్యూస్టుడే:* 'నేను ఆర్డర్ ఇస్తే..అంతర్జాతీయ కోర్టులో కూడా స్టే రాదు. ఏమనుకుంటున్నారో.. మీ ఇష్టం' అంటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని, కందుకూరు ఉప విద్యాశాఖాధికారి శ్రీనివాసులుపై రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహంవ్యక్తం చేశారు. శనివారం ప్రవీణ్ ప్రకాశ్ లింగసముద్రం మండలంలోని మొగిలిచర్ల ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.'పాఠశాలలోని ఆరో తరగతిలో 25 మంది విద్యార్థులకుగాను ఆరుగురికే ఇంగ్లిష్ పుస్తకాలున్నాయి.మిగతా విద్యార్థుల అసైన్మెంట్లు సరిగాలేవు' అంటూ మండిపడ్డారు. 'నవంబరు 25 నుంచి అర్థసంవత్సరంపరీక్షలు ప్రారంభం కానున్నాయి. 80 శాతం సిలబస్ పూర్తి కాలేదు. విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు?వారిలో విద్యా సామర్థ్యాలు ఎలా పెరుగుతాయి?ఒక్కో అధికారి రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ పాఠశాలలను పర్యవేక్షించతలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది' అని పేర్కొన్నారు. ఉప విద్యాశాఖాధికారి పైచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేకపోతే
మిమ్మల్ని డిమోషన్ చేస్తానని డీఈవో గంగాభవానినిహెచ్చరించారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి, గోరుముద్ద పథకాలుఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఏ పాఠశాల లోనైనా 85శాతం మంది బాగా చదివే విద్యార్థు లుంటారు. మిగతా 15శాతం మంది పిల్లలు వెనుక బడి ఉండటం చూస్తాం. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా చదువులు కొనసాగుతున్నాయి' అంటూ అధి కారులపై అసహనం వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న సీఆర్పీలను నియమించి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఏపీసీ ఉషారాణిని ఆదేశించారు. ఉపాధ్యా యుల పనితీరుపై ప్రవీణ్ ప్రకాశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గంగపాలెం ప్రాథమిక పాఠశా లను తనిఖీ చేశారు. మూడో తరగతి విద్యార్థుల పుస్త కాలు సరిగా లేకపోవడం పై ఎంఈవో-2 శివకుమార్, ప్రధానోపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.