Good news for the youth who are waiting for bank jobs. State Bank of India (SBI) has released a massive job notification. It is the largest public sector bank in the country headquartered in Mumbai
బ్యాంక్ జాబ్స్‌కు ఎదురుచూస్తున్న యువతకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ. ఈసారి పెద్ద ఎత్తున క్లర్క్ జాబ్‌ల ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశ వ్యాప్తంగా 8,773 జూనియర్ అసోసియేట్స్(క్లరికల్ కేడర్) పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో హైదరాబాద్ సర్కిల్‌లో 525, అమరావతి సర్కిల్‌లో 50 ఖాళీలున్నాయి. ఎనీ డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ ఈ పోస్టులు అర్హులు. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
ఖాళీల వివరాలు
పోస్టులు: జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్)
మొత్తం పోస్టుల సంఖ్య: 8,773.
హైదరాబాద్ సర్కిల్(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 525.
అమరావతి సర్కిల్(ఆంధ్రప్రదేశ్)లో పోస్టుల సంఖ్య: 50.
అప్లికేషన్లు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 17
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 07
ప్రిలిమినరీ పరీక్ష: జనవరి 2024లో జరుగుతుంది.
మెయిన్ పరీక్ష తేది: ఫిబ్రవరి 2024లో జరుగుతుంది
సెలెక్షన్: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష: ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు; న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు; రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు… 35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు.
మెయిన్ ఎగ్జామ్: మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు… 50 మార్కులు; జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు… 40 మార్కులు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు… 50 మార్కులు; రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు… 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటల 40 నిమిషాలు.