Shortage of budget during the festival..? By doing this paying EMI is so simple.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Shortage of budget during the festival..? By doing this paying EMI is so simple..

11/29/2023

 Shortage of budget during the festival...? By doing this paying EMI is so simple.

పండుగ సమయంలో బడ్జెట్‌ కొరతనా..? ఇలా చేస్తే EMI పే చేయడం సో సింపుల్..

Shortage of budget during the festival...? By doing this paying EMI is so simple.

పండుగ సీజన్‌లో ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడంలో కీలకమైన అంశం హోమ్ లోన్ EMI పేమెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ పేమెంట్స్‌ ఆపేస్తే తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు.

భారతదేశంలో పండుగల సీజన్‌ సందడి ఇంకా కొనసాగుతోంది. దసరా, దీపావళి వేడుకలు ముగియగా.. కొన్ని వారాల్లో క్రిస్‌మస్, కొత్త సంవత్సరం వేడుకలు రానున్నాయి. సాధారణంగా ఈ సమయాల్లో కుటుంబ అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి. అయితే వాటిని ప్రస్తుతం కొనసాగుతున్న హోమ్‌ లోన్‌ ఈఎంఐలతో బ్యాలెన్స్‌ చేసుకోవడం చాలా అవసరం. పండుగ సంతోషాలకు కొరత లేకుండా, ఈఎంఐ కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ఇందుకు అవసరమైన ప్లానింగ్, ఆర్థిక సూత్రాల గురించి బేసిక్ హోమ్ లోన్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు అతుల్ మోంగా ‘ఫైనాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌’తో షేర్‌ చేసుకున్న విషయాలు తెలుసుకుందాం.

EMI పేమెంట్‌: పండుగ సీజన్‌లో ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడంలో కీలకమైన అంశం హోమ్ లోన్ EMI పేమెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ పేమెంట్స్‌ ఆపేస్తే తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు. క్రెడిట్ స్కోర్‌ తగ్గవచ్చు, పెనాల్టీలు భరించాల్సి రావచ్చు. ఖర్చులు ఆదాయాన్ని మించిపోయే ప్రమాదం ఉంటే, EMI కమిట్‌మెంట్స్‌కి ఇబ్బంది కలగకుండా అనవసర ఖర్చులను తగ్గించాలి.

డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు: స్పెషల్ ఈవెంట్లు, పండుగ సీజన్‌లో స్మార్ట్ షాపింగ్‌ అవసరం. డిస్కౌంట్లు నెగోషియేట్‌ చేయాలి, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి. రిటైలర్లు అందించే ప్రమోషన్లతో సేవింగ్స్‌ పెంచుకోవచ్చు. వివిధ రిటైలర్ స్టోర్లలో ధరలను పోల్చి బెస్ట్‌ డీల్స్‌కి కొనుగోలు చేయాలి. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఖర్చు చేయాలి.

 బడ్జెట్ ప్రధానం: పండుగల వేల బడ్జెట్‌కు కట్టుబడి ఉండాలి. ముందు హోమ్ లోన్ EMI సహా ఫెస్టివల్‌ హాలిడేస్‌కి సంబంధించిన అన్ని ఊహించిన ఖర్చులను రాయండి. ఇలా చేస్తే ఆర్థిక స్థోమతపై స్పష్టత వస్తుంది. పండుగ సంతోషాలు ఇతర ఆర్థిక కమిట్‌మెంట్స్‌తో రాజీ పడకుండా చూసుకోవచ్చు.

  ఎమర్జెన్సీ ఫండ్‌: మనకు ఏదో ఒక సందర్బంలో ఊహించని ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదురుకావచ్చు. అందుకే కనీసం ఆరు నెలల ఖర్చులకు సమానమైన ఎమర్జెన్సీ ఫండ్‌ను ప్రతి ఒక్కరూ మెయింటెన్ చేయాలి. హోమ్ లోన్ EMIల కోసం కేటాయించిన బడ్జెట్‌ను వినియోగించకుండా, ఇతర అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుంది.

  రుణదాతలతో కమ్యూనికేషన్: ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు రుణదాతలతో ప్రోయాక్టివ్ కమ్యూనికేషన్ కీలకం. అనేక ఆర్థిక సంస్థలు లోన్‌ రీస్ట్రక్చరింగ్‌, EMI రీషెడ్యూలింగ్ వంటి ఆప్షన్లను అందిస్తాయి. ఇవి క్రెడిట్ స్కోర్ తగ్గకుండా తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తాయి.

ఫెస్టివ్‌ ఎక్స్‌పెన్స్‌ ఫండ్‌ : పండుగ ఖర్చుల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం మంచిది. ఏడాది పొడవునా క్రమంగా క్రియేట్‌ చేసిన ఈ ఫండ్, EMI కమిట్‌మెంట్లు, హాలిడే ఎక్స్‌పెన్స్‌లను కవర్ చేయడానికి ఉపయోగపడుతుంది.

 పండుగ బోనస్‌లు: పండుగ బోనస్‌లు లేదా మానిటరీ గిఫ్ట్‌లు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తాయి. అనవసరమైన ఖర్చులను పెంచే బదులు, హోమ్ లోన్‌ పార్షియల్‌ పేమెంట్‌ చేసేందుకు ఉపయోగించండి. ప్రిన్సిపల్ మొత్తాన్ని తగ్గించడం వల్ల దీర్ఘకాలిక వడ్డీ ఆదా అవుతుంది, EMIలు తగ్గుతాయి.

ఆకస్మిక కొనుగోళ్లు: పండుగలకు ఆకస్మికంగా చేసే కొనుగోళ్ల కారణంగా బడ్జెట్‌ దెబ్బతింటుంది. అందుకే ప్లానింగ్ ప్రకారం షాపింగ్ లిస్టును రూపొందించుకోవడం ముఖ్యం. దీంతో అనవసర వ్యయాలను అరికట్టడం వీలవుతుంది. ఆకస్మిక కొనుగోలు కంటే EMI పేమెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వడం ఆర్థిక స్థిరత్వానికి కీలకం.
  
ఫెస్టివ్‌ లోన్‌లు: పండుగ రుణాలు ఆకర్షణీయంగా అనిపించినప్పటికీ, వాటి దీర్ఘకాలిక ప్రభావాన్ని జాగ్రత్తగా విశ్లేషించాలి. అదనపు రుణాలు తీసుకోవడం అనేది చివరి ప్రయత్నంగా ఉండాలి. ఎందుకంటే అవి ఆర్థిక భారాన్ని పెంచుతాయి. పండుగ ఖర్చులను కవర్ చేయడానికి సేవింగ్స్‌ లేదా బోనస్‌లను ఉపయోగించడం మంచిది.

ఆర్థిక సలహాదారుల సలహాలు: 

ఆర్థిక సలహాదారుల సలహాలు: క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులలో ఆర్థిక సలహాదారుల సలహాలు తీసుకొని తగిన వ్యూహాలను రూపొందించుకోవచ్చు. పండుగ సీజన్‌లో పండుగ సీజన్‌లో ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడంలో కీలకమైన అంశం హోమ్ లోన్ EMI పేమెంట్‌కి ప్రాధాన్యత ఇవ్వడం. ఈ పేమెంట్స్‌ ఆపేస్తే తీవ్రమైన పరిణామాలు ఉండవచ్చు.