Success Story: రూ. 20లక్షల జీతంతో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి.. కోళ్ల వ్యాపారం.. చివరికి ఏమయ్యాడో తెలుసా.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Success Story: రూ. 20లక్షల జీతంతో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి.. కోళ్ల వ్యాపారం.. చివరికి ఏమయ్యాడో తెలుసా..

11/10/2023

 Success Story: రూ. 20లక్షల జీతంతో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి.. కోళ్ల వ్యాపారం.. చివరికి ఏమయ్యాడో తెలుసా..

ప్రపంచంలో ఎన్నో స్ఫూర్తిదాయక జీవిత కథలు ఉంటాయి. వ్యక్తులు ఉద్యోగాలు సాధిండం కోసం వారు పడ్డ కష్టాలు, ప్రతికూలతలను ఎదుర్కొన్న విధానాలు ఆసక్తిని కలుగజేస్తాయి.
అదే సమయంలో కొంతమంది ఉన్న ఉద్యోగాలను వదిలేసి జీవితంలో ఇంకా ఎదగాలన్న తలంపుతో కొత్త మార్గాలవైపు పయనిస్తారు. వారిలో కొంతమంది విజయవంతం అవుతారు.. మరికొంత మంది అంతగా విజయంసాధించకపోయినా.. తమ ప్రయత్నం తాము చేశామన్న ఆత్మసంతృప్తితో ఉంటారు. ఇటీవల కాలంలో ఫైనలియర్ చదువుకునే విద్యార్థులకు సైతం లక్షల్లో నెలవారీ జీతాలు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన వారికి అత్యధిక వేతనాలు ఇస్తున్నాయి. అయితే కొంతమంది విద్యార్థులు అటువంటి వేతనాలను కూడా వదిలిపెట్టి మరీ వ్యాపారాల వైపు మళ్లుతున్నారు. విజయం సాధిస్తున్నారు. అలాంటి ఓ విద్యార్థి.. కాదు.. విజయవంతమైన వ్యాపారవేత్త మన హైదరాబాద్ సిటీలో ఉన్నారు. ఎవరా వ్యక్తి? ఆయన చేసిన బిజినెస్ ఏమిటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్ వాసి.. కంట్రీ చికెన్..

హైదరాబాద్ కు చెందిన ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన సాయికేష్ గౌడ్ అసాధారణమైన విజయగాథ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 28 లక్షల రూపాయల ఆదాయాన్ని అందించే తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, వ్యవస్థాపకుడు కావాలనే తన కల కోసం సాయికేశ్ ముందడుగు వేశారు. సొంత కంపెనీని స్థాపించడం ద్వారా వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఆ కంపెనీకి 'కంట్రీ చికెన్ కో' అని పేరు పెట్టారు. దీంతో నాటు కోళ్లను పెంచి, విక్రయిస్తున్నారు. ఇది ఇప్పుడు రూ. 1 కోటి రూపాయల నెలవారీ ఆదాయాన్ని కలిగి ఉంది.

సాయికేష్ విద్యాభ్యాసం..

ఐఐటీ వారణాసిలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీని సాయికేష్ పూర్తి చేశారు. తదనంతరం, అతను సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా గౌరవనీయమైన స్థానాన్ని సంపాదించాడు. లాభదాయకమైన వార్షిక జీతం ప్యాకేజీ రూ. 28 లక్షలు. ఈ దశలోనే వ్యాపార రంగంలోకి రావాలనే అతి కలకు అంకురార్పణ జరిగింది.

బిజినెస్ ప్రారంభం ఇలా..

సాయికేష్ అచంచలమైన ఉత్సాహం, ఆకాంక్షలను గుర్తించి, సహ వ్యవస్థాపకులలో ఒకరైన హేమాంబర్ రెడ్డి, వారి కలలను సాకారం చేసుకోవడంలో అతనితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. మొహమ్మద్‌ సమీ ఉద్దీన్ తో కలిసి వారు తమ వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించారు. కంట్రీ చికెన్ కో ను ప్రారంభించారు. హేమాంబర్ రెడ్డి పౌల్ట్రీ పరిశ్రమలో నైపుణ్యం, మాంసం వ్యాపారంలో మెలకువలో తెలిసి ఉండటంతో సాయికేష్ ఆలోచనలు వేగంగా అమలు చేయడానికి దోహదపడింది.

స్థానిక యువతకు ఉపాధి..

భారతదేశంలోని మొట్టమొదటి ప్రామాణికమైన కంట్రీ చికెన్ రెస్టారెంట్‌లను, ప్రత్యేకంగా హైదరాబాద్‌లో,కూకట్‌పల్లి, ప్రగతి నగర్‌లలో స్థాపించడంలో సాయికేష్ , బృందం కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. ముఖ్యంగా, ఈ రెస్టారెంట్ల స్థాపనతో సుమారు 70 మంది స్థానిక వ్యక్తులకు ఉపాధి అవకాశాలను కల్పించింది. అదనంగా, కంపెనీ దక్షిణాది రాష్ట్రాలలో 15,000 మంది పౌల్ట్రీ రైతులతో కీలకమైన సంబంధాలను ఏర్పరుచుకుంది, ఈ రైతుల నుంచి పోటీ ధరలకు కంట్రీ చికెన్ కోడిపిల్లలను కొనుగోలు చేస్తోంది.

నాణ్యతకు ప్రాధాన్యం..

కంట్రీ చికెన్ కో. కూడా తమ కోళ్ల ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడుకోవడానికి ఉత్తమ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించే చొరవను ప్రారంభించింది. ఈ విధానం కఠినమైన నాణ్యతా ప్రమాణాలను కొనసాగిస్తూ, కస్టమర్‌లకు రుచికరమైన, అధిక-నాణ్యత చికెన్‌ని అందించడానికి దోహదపడుతోంది.

లాభాల బాటలో..

2022-2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 5 కోట్ల రూపాయల విశేషమైన ఆదాయాన్ని సాధించిందని ఇటీవలి నివేదికలు చూపిస్తున్నాయి. ఆకట్టుకునే విధంగా, జనవరి 2022 నుంచి ఏప్రిల్ 2023 వరకు, కంపెనీ గణనీయమైన వృద్ధిని సాధించింది, దాని నెలవారీ ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 1.2 కోట్లకు పెరిగింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్ల ఆదాయాన్ని సాధించాలనే లక్ష్యంతో కంట్రీ చికెన్ కో. ఇప్పుడు పనిచేస్తోంది.


close