Tippa teega తిప్పతీగతో డయాబెటిస్ సమస్యకు అడ్డుకట్ట, ఎలా? - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Tippa teega తిప్పతీగతో డయాబెటిస్ సమస్యకు అడ్డుకట్ట, ఎలా?

11/08/2023

 తిప్పతీగతో డయాబెటిస్ సమస్యకు అడ్డుకట్ట, ఎలా?

పొలాల్లో చెట్లను అల్లుకుని పిచ్చిమొక్కలా కనిపించే తీగజాతి మొక్క తిప్పతీగ. ఆయుర్వేద ఔషధాల్లో వాడే తిప్పతీగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది, ఒత్తిడిని పారదోలగల శక్తి తిప్పతీగకు వుంది. తిప్పతీగలో యాంటీ ఆర్థరైటిస్ గుణాలున్నాయి, కనుక నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. తిప్పతీగలో ఉండే ఆల్కలాయిడ్లు, లాక్టేన్లు వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరంలో షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో తిప్పతీగ దోహదపడుతుంది. తిప్పతీగలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. తిప్పతీగతో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి డయాబెటిస్ అదుపులో వుంటుంది. తిప్పతీగను గర్భిణీలు, పాలిచ్చే తల్లులు తీసుకోరాదని ఆయుర్వేదం చెపుతోంది.


close