AP 10th, Inter Exam Schedule 2024: Andhra Pradesh 10th, Inter Annual Exam Schedule Released.. Exams in March - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

AP 10th, Inter Exam Schedule 2024: Andhra Pradesh 10th, Inter Annual Exam Schedule Released.. Exams in March

12/14/2023

AP 10th, Inter Exam Schedule 2024: Andhra Pradesh 10th, Inter Annual Exam Schedule Released.. Exams in March

AP 10th, Inter Exam Schedule 2024: Andhra Pradesh 10th, Inter Annual Exam Schedule Released.. Exams in March

AP 10th, Inter Exam Schedule 2024: ఆంధ్రప్రదేశ్‌ టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. మార్చిలోనే పరీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహించనున్న పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ గురువారం (డిసెంబర్ 14) విడుదలైంది. మర్చిలో టెన్త్‌, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు, మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణియించినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

మొత్తం 16 లక్షల మంది విద్యార్ధులు టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు 6 లక్షల మంది హాజరుకానున్నారని అన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇక ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదని, మార్చిలోనే ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స తెలిపారు.

AP SSC Time Table 2024 Pdf Download