Australia: These are the best short term courses in Australia..fees, duration of courses, other details.. - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Australia: These are the best short term courses in Australia..fees, duration of courses, other details..

12/27/2023

Australia: These are the best short term courses in Australia..fees, duration of courses, other details..

Australia: These are the best short term courses in Australia..fees, duration of courses, other details..

Australia: ఆస్ట్రేలియాలో బెస్ట్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ఇవే..ఫీజు,కోర్సుల వ్యవధి,ఇతర వివరాలు..

ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆస్ట్రేలియా యూనివర్సిటీలు అడ్వాన్స్‌డ్‌, ఇంటెన్సివ్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తూ ఇంటర్నేషన్‌ స్టూడెంట్స్‌ని ఆకర్షిస్తున్నాయి.

Australia: ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. భారతదేశం నుంచి అమెరికాతోపాటు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆస్ట్రేలియా యూనివర్సిటీలు అడ్వాన్స్‌డ్‌, ఇంటెన్సివ్ స్కిల్ డెవలప్‌మెంట్‌ కోర్సులు ఆఫర్‌ చేస్తూ ఇంటర్నేషన్‌ స్టూడెంట్స్‌ని ఆకర్షిస్తున్నాయి. డిజిటల్ మార్కెటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, డేటా సైన్స్, క్రియేటివ్ రైటింగ్ లేదా సైబర్‌సెక్యూరిటీపై స్పెషల్ కోర్సులను అందిస్తున్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా అందిస్తున్న బెస్ట్‌ షార్ట్‌ టర్మ్‌ కోర్సులపై amberstudent.com సీఈఓ & కో ఫౌండర్‌ సౌరభ్ గోయెల్ ‘ఇండియా టుడే’తో షేర్‌ చేసుకున్న వివరాలు చూద్దాం.

క్రియేటివ్ రైటింగ్ వర్క్‌షాప్:

క్రియేటివ్‌ రైటింగ్‌ కేవలం ఒక కళ కాదు. ఇది ఒక విలువైన నైపుణ్యం. గత 5 సంవత్సరాలలో ఫ్రీలాన్స్ రైటింగ్ మార్కెట్ 300% పెరిగింది. ఫ్రీలాన్స్ రైటర్స్‌ గంటకు AUD 100(దాదాపు రూ.5,693)వరకు సంపాదించగలరు. eBook మార్కెట్ వాటా 2024 నాటికి గ్లోబల్ బుక్ మార్కెట్‌లో 26%కి చేరుకుంటుందని భావిస్తున్నారు. హైస్కూల్ డిప్లొమా లేదా అందుకు సమానమైన అర్హత, ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ, రైటింగ్‌, స్టోరీ టెల్లింగ్‌పై ఆసక్తి ఉన్న వాళ్లు అప్లై చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి 4 నుంచి 12 వారాలు ఉంటుంది, సుమారు AUD 800(రూ.45,552) నుంచి AUD 1,600(దాదాపు రూ.91,104) వరకు ఫీజులు ఉండవచ్చు. క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం, కర్టిన్ విశ్వవిద్యాలయం ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్నాయి. కంటెంట్ రైటర్, ఎడిటర్, ఫ్రీలాన్స్ రైటర్‌ ఉద్యోగాలు పొందవచ్చు.

సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స:

నేటి డిజిటల్ ప్రపంచంలో, సైబర్‌ సెక్యూరిటీ కీలకం. 2015 నుంచి సైబర్‌క్రైమ్‌లో 300 శాతం పెరుగుదల కనిపించింది. ఈ రిక్వైర్‌మెంట్‌లు తీర్చేలా సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కోర్సు రూపొందించారు. సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాలు 2019 నుంచి 2029 మధ్య 31 శాతం పెరుగుతాయని అంచనా. ఈ మార్కెట్‌ 2026 నాటికి USD 345.4 బిలియన్లకు చేరుకుంటుందనే అంచనాలు, ఇన్వెస్ట్‌మెంట్‌, కెరీర్ ఆప్షన్స్‌ పెరుగుదలను సూచిస్తున్నాయి.

హైస్కూల్ డిప్లొమా లేదా అందుకు సమానమైన అర్హత, ఐటీపై ఫోకస్‌, డేటా ప్రైవసీ ప్రాముఖ్యతపై స్పష్టమైన అవగాహన ఉన్న వాళ్లు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ఈ కోర్సును అందించే టాప్‌ వర్సిటీలలో ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఉన్నాయి. కోర్సు వ్యవధి 8 నుంచి 16 వారాలు. సుమారు AUD 2,500(దాదాపు రూ.142,350) నుంచి AUD 5,000(దాదాపు రూ.284,700) వరకు ఫీజులు ఉంటాయి. సెక్యూరిటీ అనలిస్ట్, నెట్‌వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఐటీ సెక్యూరిటీ కన్సల్టెంట్ వంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.

ఇంట్రడక్షన్‌ టూ డేటా సైన్స్:

డేటా సైన్స్ ఉద్యోగాలు 2012 నుంచి 650 శాతం పెరిగాయి. ఇంట్రడక్షన్‌ టూ డేటా సైన్స్ కోర్సు వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకదానికి గేట్‌వేగా మారింది. గత రెండేళ్లలో ప్రపంచంలోని 90 శాతం డేటా క్రియేట్‌ అవ్వడంతో, డేటా సైంటిస్టులకు డిమాండ్ పెరుగుతోంది.

హైస్కూల్ డిప్లొమా లేదా అందుకు సమానమైన అర్హత, ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్‌పై ప్రాథమిక అవగాహన, డేటా ప్యాటర్న్స్‌పై ఆసక్తి ఉన్న వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్సును అందించే టాప్‌ యూనివర్సిటీలలో యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ, మోనాష్ యూనివర్సిటీ ఉన్నాయి. కోర్సు వ్యవధి 8 నుంచి 16 వారాలు ఉంటుంది. మొత్తం సుమారు AUD 2,000(దాదాపు రూ.113,880) నుంచి AUD 4,000(దాదాపు రూ.227,760) వరకు ఫీజులు ఉంటాయి. డేటా అనలిస్ట్, జూనియర్ డేటా సైంటిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ వంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.

ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపల్స్‌:

ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌పై ఆసక్తి ఉన్నవారికి, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్స్‌ కోర్సు బెస్ట్‌ ఆప్షన్‌. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 22 మిలియన్ యాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజర్‌లు ఉన్నారు. ఈ కోర్సుతో ఆస్ట్రేలియాలో AUD 139,000 (దాదాపు రూ.7,914,660) యాన్యువల్‌ శాలరీతో ఉద్యోగంలో స్థిర పడవచ్చు. సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్‌లు వారి నాన్-సర్టిఫైడ్ కౌంటర్‌పార్ట్‌ల కంటే 20 శాతం ఎక్కువ సంపాదిస్తారు. ప్రాజెక్ట్ మేనేజర్‌లకు డిమాండ్ ఇతర వృత్తుల కంటే వేగంగా పెరుగుతోంది.

హై స్కూల్‌ డిప్లొమా లేదా సమానమైన కోర్సు, అనలిటికల్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌, లీడర్‌షిప్‌, మేనేజ్‌మెంట్‌ రోల్స్‌పై ఆసక్తి ఉన్న వ్యక్తులు అప్లై చేసుకోవచ్చు. ఈ కోర్సును అందించే టాప్‌ వర్సిటీలలో మెల్బోర్న్ యూనివర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఉన్నాయి. కోర్సు వ్యవధి 6 నుంచి 12 వారాలు, సుమారు AUD 1,500(దాదాపు రూ.85,410) నుంచి AUD 3,000(దాదాపు రూ.170,820)వరకు ఫీజులు ఉంటాయి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఎజైల్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.

డిజిటల్ మార్కెటింగ్ ఎసెన్షియల్స్:

డిజిటల్ మార్కెటింగ్, 2026 నాటికి 10 శాతం జాబ్ మార్కెట్ వృద్ధిని సాధించనున్న డైనమిక్ ఫీల్డ్. ఆన్‌లైన్ మార్కెటింగ్ స్ట్రాటెజీలు, అనలిటిక్స్‌పై లోతైన అవగాహన అందిస్తుంది. 80 శాతం బిజినెస్‌లు డిజిటల్ మార్కెటింగ్ స్పెండింగ్‌ పెంచే యోచనలో ఉన్నాయి. 2023 నాటికి AUD 11.3 బిలియన్ల డిజిటల్ యాడ్ స్పెండిగ్‌ అంచనా వేస్తున్నారు. ఈ కోర్సు అవసరమైన నైపుణ్యాలను అందిస్తుంది.

హైస్కూల్ డిప్లొమా లేదా అందుకు సమానమైన అర్హత, ఇంగ్లీషులో ప్రొఫిషియన్సీ, డిజిటల్ ట్రెండ్స్‌, టెక్నాలజీలపై ఆసక్తి ఉన్న వాళ్లు అర్హులు. ఈ కోర్సును అందించే టాప్‌ యూనివర్సిటీలలో యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, RMIT ఉన్నాయి. కోర్సు వ్యవధి 4 నుంచి 8 వారాలు. సుమారు AUD 1,000(దాదాపు రూ.56,940) నుంచి AUD 2,000(దాదాపు రూ.113,880) వరకు ఫీజులు ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్, SEO స్పెషలిస్ట్, కంటెంట్ స్ట్రాటజిస్ట్ వంటి ఉద్యోగాల్లో స్థిరపడవచ్చు.