Group 2: Good News.. Free Coaching for Group 2 Prelims.. Anywhere! - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Group 2: Good News.. Free Coaching for Group 2 Prelims.. Anywhere!

12/19/2023

 Group 2: Good News.. Free Coaching for Group 2 Prelims.. Anywhere!

Group 2: Good News.. Free Coaching for Group 2 Prelims.. Anywhere!

Group 2: శుభవార్త.. గ్రూప్ 2 ప్రిలిమినరీకి ఉచిత శిక్షణ.. ఎక్కడంటే!

తిరుపతి పట్టణంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిక్రూమెంట్ ప్రిలిమినరీ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన పేదల అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి బి. భాస్కర్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఈనెల 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

27 నుంచి 50 రోజులపాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిఫండ్, స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీలో మార్కుల మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఎంపికైన వారికి తిరుపతి ఎంఆర్ పల్లి బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు.

దరఖాస్తులను తిరుపతిలోని ఏపీ బీసీ స్టడీ సర్కిల్ ఫర్ బీసీఎస్ డోర్ నెంబర్ 4-1712 లో సమర్పించాలని సూచించారు. వివరాలకు 9441456039, 9985022254, 9346221553 నంబర్లలో సంప్రదించాలని కోరారు. గడువు నాలుగు రోజులు మాత్రమే ఉంది. డిగ్రీలో మంచి మార్కులు సాధించిన వారు త్వర పడండి. ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే కూడా సబ్జెక్ట్‌లో మంచి పట్టు ఉండాలి. బేసిక్స్‌తో అవగాహన కల్పించనున్నారు.