Ration Dealer Jobs - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Ration Dealer Jobs

12/31/2023

Ration Dealer Jobs

Ration Dealer Jobs

Ration Dealer Jobs: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. రేషన్‌ డీలర్ల నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల! పదో తరగతి పాసైతే చాలు.

నల్లగొండ డివిజన్‌లో రేషన్‌ డీలర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 20 గ్రామాల్లో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్ల పోస్టుల భర్తీకి ఆర్డీఓ రవి శనివారం (డిసెంబర్‌ 30) నోటిఫికేషన్‌ జారీ చేశారు.

చిట్యాల మండలంలోని వట్టిమర్తి, తాళ్లవెల్లెంల, వేంబాయి గ్రామలు, కనగల్‌ మండలంలోని తుర్కపల్లి, లచ్చుగూడెం గ్రామాలు, కట్టంగూర్‌ మండలంలోని ఊదులూరు, నారగూడెం, పామనుగుండ్ల, యరసానిగూడెం గ్రామాలు, కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామం, నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల, తాటికల్‌ గ్రామాలు, నల్లగొండ మండలంలోని పానగల్‌ గ్రామం, నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామం, శాలిగౌరారం మండలంలోని అంబారిపేట, ఊట్కూరు, ఉప్పలంచ గ్రామాలు, తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లి, రామలింగాలగూడెం, రాజుపేట గ్రామాల్లో ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషణ్‌లో తెలిపారు.

అర్హత, ఆసక్తి కలిగిన వారు రిజర్వేషన్ల వారీగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత గ్రామంలో నివసించే వారై ఉండాలి. అలాగే పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయసు 18 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి.

ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ ఇతర వ్యాపారాలు లేనివారై ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసుకున్న వారందరికీ జనవరి 12న నల్లగొండలోని ఆర్డీఓ కార్యాలయంలో రాత పరీక్ష నిర్వహిస్తారని, మెరిట్‌ సాధించిన వారిని ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు.

రేషన్‌కార్డుల ఈ-కేవైసీ తుది గడువు జనవరి 31

రేషన్‌కార్డు లబ్ధిదారులు వచ్చే ఏడాది జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ శనివారం (డిసెంబర్ 30) ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండు నెలలుగా చౌకధరల దుకాణాల్లో డీలర్లు ఈ-కేవైసీని స్వీకరిస్తున్నారు. ఆధార్‌ ధ్రువీకరణ పత్రం, వేలిముద్రలు, కంటి బయోమెట్రిక్‌ గుర్తింపులను తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి దాదాపు 70.80 శాతం మంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు.