BDL : 361 Engineer Jobs in Bharat Dynamics - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

BDL : 361 Engineer Jobs in Bharat Dynamics

1/27/2024

BDL : 361 Engineer Jobs in Bharat Dynamics

BDL : భారత్‌ డైనమిక్స్‌లో 361 ఇంజినీర్‌ జాబ్స్‌.. పరీక్ష లేకుండానే ఉద్యోగం.. రూ.39,000 వరకూ జీతం.

BDL : 361 Engineer Jobs in Bharat Dynamics BDL : భారత్‌ డైనమిక్స్‌లో 361 ఇంజినీర్‌ జాబ్స్‌.. పరీక్ష లేకుండానే ఉద్యోగం.. రూ.39,000 వరకూ జీతం.

Bharat Dynamics Limited : బీడీఎల్‌ భారీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 361 ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • బీడీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2024
  • 361 ఇంజినీర్‌ పోస్టుల భర్తీ
  • వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహణ
  • బీడీఎస్‌ ఇంజినీర్‌ రిక్రూట్‌మెంట్‌ 2024

BDL Engineers Recruitment 2024 : ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL).. జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాలుగేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్ (కాంట్రాక్ట్) ప్రాతిపదికన హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నంలోని ఉన్న బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో 361 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బీడీఎల్‌ కార్పొరేట్ ఆఫీస్ (హైదరాబాద్), బీడీఎల్‌ కంచన్‌బాగ్ యూనిట్ (హైదరాబాద్), బీడీఎల్‌ ప్రాజెక్ట్ ఆఫీస్ ఏడీఈ (బెంగళూరు), భానూర్ యూనిట్ (సంగారెడ్డి జిల్లా), విశాఖపట్నం యూనిట్ (ఆంధ్రప్రదేశ్)లో పని చేయాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 361

ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్‌: 136 పోస్టులు

ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెంట్: 142 పోస్టులు

ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్: 83 పోస్టులు

ముఖ్య సమాచారం :

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, కెమికల్, ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, సివిల్, మెటలర్జీ, ఫిట్టర్, రేడియో మెకానిక్, టర్నర్, వెల్డర్, ఎలక్ట్రో ప్లేటింగ్, కంప్యూటర్స్, ఎలక్ట్రీషియన్, మిల్ రైట్, డీజిల్ మెకానిక్‌, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్ కండిషనింగ్, ప్లంబర్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.

అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 14.02.2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు రూ.30,000-రూ.39,000.. ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు రూ.25,000 - రూ.29,500.. ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్‌కు రూ.23,000- రూ.27,500గా నిర్ణయించారు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: ప్రాజెక్ట్ ఇంజినీర్/ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు రూ.300. ఇతర పోస్టులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: ఫిబ్రవరి 17,18,21,22,25 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ వేదిక: బీడీఎల్‌ కంచన్‌బాగ్ (హైదరాబాద్), బీడీఎల్‌ భానూర్ (సంగారెడ్డి), బీడీఎల్‌ విశాఖపట్నం యూనిట్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Important Links:

FOR  NOTIFICATION  CLICKHERE.

FOR   WEBSITE CLICKHERE.

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE