Business Idea - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Business Idea

1/12/2024

Business Idea: Rs.  50 thousand investment..Rs.10 lakhs return in two years..Easy business..Full details

Business Idea: రూ. 50వేల పెట్టుబడి.. రెండేళ్లలో రూ.10లక్షలు రాబడి.. సులువైన వ్యాపారం.. పూర్తి వివరాలు

Business Idea: Rs.  50 thousand investment..Rs.10 lakhs return in two years..Easy business..Full details

తక్కువ ఖర్చుతో మంచి రాబడి వచ్చే వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే వర్మీ కంపోస్టింగ్. మీకు వ్యవసాయంపై కనీస అవగాహన ఉంటే ఇది మీకు బాగా అర్థం అవుతుంది. ఇటీవల కాలంలో గ్లోబల్ వైడ్ గా లాభదాయకమైన అగ్రి బిజినెస్ గా ఇది ఆవిర్భవించింది. ముఖ్యంగా దీనిలో పెట్టుబడి చాలా తక్కువ. వాస్తవానికి ఈ వ్యాపారం గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది.

తక్కువ ఖర్చుతో మంచి రాబడి వచ్చే వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో మంచి ఆప్షన్ అందుబాటులో ఉంది. అదే వర్మీ కంపోస్టింగ్. మీకు వ్యవసాయంపై కనీస అవగాహన ఉంటే ఇది మీకు బాగా అర్థం అవుతుంది. ఇటీవల కాలంలో గ్లోబల్ వైడ్ గా లాభదాయకమైన అగ్రి బిజినెస్ గా ఇది ఆవిర్భవించింది. ముఖ్యంగా దీనిలో పెట్టుబడి చాలా తక్కువ. వాస్తవానికి ఈ వ్యాపారం గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. వర్మీ కంపోస్ట్ అంటే ఘన వ్యర్థాల నుంచి సాగుకు ఉపయోగపడే పోషకాలు కలిగి ఉండే కంపోస్ట్ ను వానపాములను వినియోగించి తయారు చేసే సహజ ప్రక్రియ. నీటిలో కరిగే పోషకాలతో నిండిన వర్మికంపోస్ట్ ఒక అద్భుతమైన సేంద్రీయ ఎరువు. ఇది మట్టి కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది వ్యవసాయ ఔత్సాహికులకు విలువైన ఆస్తి. ఒకవేళ మీరు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు గడించాలని భావిస్తే.. ఈ వర్మీకంపోస్టింగ్ వ్యాపారాన్ని ట్రై చేయొచ్చు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తున్నాం. ఓ లుక్కేయండి.

వ్యాపారానికి ఇవి అవసరం..

వర్మీకంపోస్ట్ వెంచర్‌ను ప్రారంభించడానికి, మీరు ముందుగా మీ వర్మీకంపోస్ట్ యూనిట్ వృద్ధి చెందగల విశాలమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎంచుకున్న స్థలం నీటి ఎద్దడికి గురి కాకూడదు. అదనంగా, మీకు జంతువుల పేడ, వానపాములు, పాలిథిన్ షీట్‌లు, వరి గడ్డి లేదా పేడను కప్పడానికి తగిన ఇతర గడ్డి వంటి పదార్థాలతో సహా అవసరమైన వనరులు సులభంగా సమకూర్చునేలా ఉండాలి.

ప్రాంతాన్ని భద్రపరచండి.. మీరు వ్యాపారం ప్రారంభించాలనుకునే ప్రాంతం చుట్టూ కంచె వేయాలి. ఎందుకంటే జంతువులు వాటిపై వైపు రాకుండా కాపాడుకోవాలి.

పాలిథిన్ షీట్ సెటప్.. మార్కెట్ నుంచి పొడవాటి పాలిథిన్ షీట్‌ను కొనుగోలు చేయాలి. మీకు అవసరమైన కొలతలకు, సాధారణంగా 2 మీటర్ల వెడల్పుతో కత్తిరించాలి. ఆ తర్వాత నేలను చదును చేసి దానిపై షీట్ వేయండి.

పొరలు వేయడం.. పాలిథిన్ షీట్‌పై ఆవు పేడ ఒక లేయర్ గా పూయండి. దానిపై వానపాములను షీట్ అంతా పరచండి. ఆవు పేడ పొరను 1.5 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉంచాలి.

కవరింగ్, తేమ నిర్వహణ.. కంపోస్ట్ పొరను వరి గడ్డి లేదా తగిన గడ్డితో సమర్థవంతంగా కప్పండి. ఆవు పేడలో సరైన తేమను నిర్వహించడం చాలా ముఖ్యం.

పురుగుమందులు లేని వాతావరణం.. పురుగుమందుల వాడకాన్ని నివారించండి.. కంపోస్ట్ ప్రాంతంలోకి పాములు మరియు ఎలుకలు ప్రవేశించకుండా చర్యలు తీసుకోండి. వానపాములు తమ పని చేస్తాయి, సుమారు రెండు నెలల్లో ఆవు పేడను వర్మీ కంపోస్ట్‌గా మారుస్తాయి. సిద్ధమైన తర్వాత, వానపాములను వేరు చేయడానికి కంపోస్ట్‌ను ఫిల్టర్ చేయండి.

ఖర్చులు ఇలా..

వర్మీకంపోస్టింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే దాదాపు రూ. 50,000 ప్రాథమిక పెట్టుబడి అవసరం. ఈ వ్యయంలో గణనీయమైన భాగం వానపాములను సేకరించేందుకు అవుతుంది. ఇవి కిలోగ్రాము సుమారు రూ. 100కి లభిస్తాయి. వానపాములు వేగంగా పునరుత్పత్తి చేస్తాయి, సుమారు మూడు నెలల్లో వాటి జనాభా రెట్టింపు అవుతుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి అంశం. ఇది ఒకేసారి పెట్టే పెట్టుబడి. ఆవు పేడ, వరి గడ్డి వంటి ఇతర ముడి పదార్థాలు సరసమైన ధరకే లభిస్తాయి.

మార్కెట్ ఎలా ఉంటుంది..

రైతులు, పండ్లు, కూరగాయల నర్సరీలు, కిచెన్ గార్డెనింగ్ ఔత్సాహికులతో సహా అనేక రకాల వినియోగదారులకు వర్మికంపోస్ట్ ను సులభంగా విక్రయించుకోవచ్చు. తోటపని, పర్యావరణ అనుకూల పద్ధతులపై పెరుగుతున్న ఆసక్తి కారణంగా, వర్మీకంపోస్ట్, కంపోస్ట్ ఎరువులు కూడా ఆన్ లైన్ మార్కెట్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాయి.

టర్నోవర్ ఇలా..

మీరు 20 పడకలతో మీ వర్మీకంపోస్టింగ్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే, మీరు రెండేళ్లలో రూ. 8,00,000 నుంచి రూ. 10,00,000 వరకు టర్నోవర్‌ను పొందే అవకాశం ఉంది.